: బెంగళూరులో మందుబాబులు గొప్ప విద్యావంతులు, అలా చేయరు!: కర్నాటక మంత్రి


పల్లెటూళ్లకు చెందిన తాగుబోతులే ఫుట్ పాత్ లపై పడుకుంటారు తప్పా, బెంగళూరు నగరంలోని మందుబాబులు అలా చేయరని.. వాళ్లందరూ గొప్ప విద్యావంతులంటూ కర్నాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్.వై. మేటి తనదైన శైలిలో మాట్లాడారు. బెంగళూరులో నైట్ లైఫ్ ను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడాన్ని సమర్థించుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మద్యనిషేధం అమలు చేసే ఆలోచన లేదని, గ్రామాల్లో మాత్రం మద్యం అక్రమ అమ్మకాలను నిరోధిస్తామని చెప్పారు. కొత్త బార్ అండ్ రెష్టారెంట్లకు లైసెన్స్ లు ఇవ్వమని మేటి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News