: జీఎస్టీ వచ్చేస్తోంది... ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎంతో కాలంగా నలుగుతూ వస్తున్న వస్తు సేవల పన్నుకు అడ్డంకులన్నీ తొలగినట్టే కనిపిస్తోంది. ఈ బిల్లుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం కొంత మెత్తబడటం, అధికార బీజేపీ కీలక మార్పులు చేయడంతో, ఇక ఆమోదమే తరువాయని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బిల్లును అమల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తున్న వేళ, జీఎస్టీ అమలైతే వేటి ధరలు పెరుగుతాయో, వేటి ధరలు తగ్గుతాయో ఓ సారి పరిశీలిస్తే... ధరలు తగ్గేవి: * ఎంట్రీ లెవల్ కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు * కారు బ్యాటరీల ధరలు కూడా దిగొస్తాయి. * పెయింట్, సిమెంట్ ధరలు తగ్గుతాయి. * వినోదపు పన్ను గణనీయంగా తగ్గుతుంది కాబట్టి సినిమా టికెట్ ధరలు దిగొస్తాయి. * ఫ్యాన్లు, లైటింగ్, వాటర్ హీటర్లు, కూలర్ల తదితరాలపై పన్నులు తగ్గి ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. ధరలు పెరిగేవి * పొగాకు మీద జీఎస్టీ పన్ను మరింతగా పెరుగుతుంది కాబట్టి సిగరెట్లు, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. * ఇప్పుడున్న సేవా పన్నుతో పోలిస్తే మొబైల్ రంగంపై పన్ను భారం పెరుగుతుంది కాబట్టి సెల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. * దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాల ధరలూ పెరుగుతాయి.