: అమితాబ్ కు నాడు పునర్జన్మ నిచ్చాము... సెయింట్ ఫిలోమినా ఆసుపత్రి సిబ్బంది


‘కూలీ’ చిత్రం షూటింగ్ లో నాడు గాయపడ్డ అమితాబ్ బచ్చన్ కు పునర్జన్మ నిచ్చింది తామేనంటూ బెంగళూరులోని సెయింట్ పిలోమినా ఆసుపత్రి సిబ్బంది నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముఫ్పై నాలుగేళ్ల కిందట ఆగస్టు 2వ తేదీన బెంగళూరు యూనివర్శిటీలో ‘కూలీ’ చిత్రానికి సంబంధించి ఒక ఫైట్ సీన్ జరగుతుండగా అమితాబ్ పొత్తి కడుపుకు గాయాలవడంతో ఆయన్ని వెంటనే మదర్ థెరిసా రోడ్డులో ఉన్న సెయింట్ పిలోమినా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి అమితాబ్ ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ, లెజెండ్ నటుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడటం తమకు గర్వంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News