: తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఈరోజు అత్యవసర ల్యాండింగ్ కావాల్సివచ్చింది. విమానంలో ఒక్కసారిగా పొగలు రావడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాంతో విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే విమానంలో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగితే విమానంలోని ప్రయాణికులకు చికిత్స అందించాలని విమానాశ్రయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.