: 1400 మంది పట్టే బస్సు... విజయవంతంగా పరీక్షించిన చైనా


ఒక బస్సులో ఎంత మంది పడతారు? కూర్చుని ప్రయాణిస్తే ఓ 40 మంది... కిక్కిరిసిపోయి నిలబడి కూడా ప్రయాణిస్తే ఓ 70 నుంచి 80 మంది ప్రయాణించవచ్చు. కానీ, 1400 మంది సులువుగా ఎక్కి ప్రయాణించగల పెద్ద బస్సును ఊహించండి... చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రాన్సిట్ ఎక్స్ ప్లోర్ అనే సంస్థ అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన టీఈబీ-1 బస్సును ప్రత్యేక ట్రాక్ పై విజయవంతంగా నడిపించింది. 22 మీటర్ల పొడవు, 7.8 మీటర్ల వెడల్పుండే ఈ బస్సులో కంపార్టు మెంట్ భూమికి చాలా ఎత్తులో ఉంటుంది. దీని కింద నుంచి కార్లు, మామూలు బస్సులు వంటి వాహనాలు సులువుగా వెళ్లవచ్చు. దీంతో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గంటకు 60 కి.మీ వేగంతో దూసుకెళ్లే బస్సును 'ల్యాండ్ ఎయిర్ బస్' అని పిలుస్తోంది ట్రాన్సిట్ ఎక్స్ ప్లోర్.

  • Loading...

More Telugu News