: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త...సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీ


తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇప్పటికే టీపీపీఎస్సీ ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం... తాజాగా మరిన్ని ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లో 1794 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ఈ శాఖలో అనుమతించిన 758 పోస్టులకు ఇవి జత కలవనున్నాయి. దీంతో ఈ శాఖలో భర్తీ చేసే పోస్టులు మొత్తం 2552 అవుతాయి.

  • Loading...

More Telugu News