: షారూఖ్ ఖాన్ ప్రశంసకు దర్శక-నిర్మాత కరణ్ జొహార్ కన్నీళ్లు
రణబీర్ కపూర్, ఐశ్వరరాయ్ బచ్చన్, ఫవద్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’. శరవేగంగా నిర్మాణాన్ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే దీపావళికి విడుదల కానుంది. అయితే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం మ్యూజిక్ బాగుందంటూ మెచ్చుకున్న సమయంలో తాను కన్నీళ్లు రాల్చానని దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. షారుఖ్ అభినందన తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఆయన అన్నారు. మ్యూజిక్ బాగుందంటూ అలా పొగడడం షారుఖ్ గొప్పదనంగా కరణ్ జోహార్ అభివర్ణించారు. తన సినిమా, మ్యూజిక్ ఎలా ఉంటుందోనని తాను ఆత్రుతగా వేచిచూశానని, దానికి బాలీవుడ్ బాద్షా ప్రశంసలు రావడం తమకు చాలా పెద్ద విషయమని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆయన అన్నారు.