: సొంత పార్టీ నుంచే సెగలు... ట్రంప్ కు ఓటు వేయవద్దన్న తొలి రిపబ్లికన్ గా రిచర్డ్ హన్నా
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై వైట్ హౌస్ లో కాలు మోపాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది. ఆయనకు ఓటు వేయవద్దని తొలిసారిగా ఓ రిపబ్లికన్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ హన్నా, నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థికి మాత్రమే ఓటు వేయాలని కోరారు. తన గమ్యం ఏంటో కూడా ట్రంప్ కు తెలియడం లేదని ఓ దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఆరోపించారు. ఆయన్ను అధ్యక్ష పదవికి బరిలోకి దించి తప్పు చేశామని ఎంతో మంది రిపబ్లికన్లు బాధ పడుతున్నారని అన్నారు.