: రోడ్లు ఊడ్చిన మల్లాది విష్ణు... ‘హోదా’ కోసం బెజవాడలో మాజీ ఎమ్మెల్యే వినూత్న నిరసన


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు కూడా రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో వినూత్న నిరసనకు దిగారు. చేతిలో చీపురు పట్టుకుని నగరంలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ప్రత్యక్షమైన విష్ణు... అక్కడి రోడ్లను ఊడ్చారు. మల్లాదితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు మల్లాదితో పాటు మహిళా కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News