: ముగిసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్... గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ?
న్యూఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులో ఉన్న ప్రధాని అధికార నివాసంలో భారతీయ జనతా పార్టీ సమావేశం ముగిసింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేసిన వేళ, తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయమై ప్రధానంగా చర్చ జరుగగా, విజయ్ రూపానీని టాప్ చాయిస్ గా నేతలు భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన వైపే అమిత్ షా సైతం మొగ్గు చూపినట్టు సమాచారం. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారిక ప్రకటన వెలువరిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ కు ఇద్దరు పరిశీలకులను పంపాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.