: ట్రంప్ పనికిరాడని తేల్చేసిన ఒబామా!
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పనికిరాడని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఆయనపై, ఆయన సంస్థలపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసిన ఒబామా, తనకు అధ్యక్షుడినయ్యే అర్హతలు లేవని ఎన్నో మార్లు నిరూపించుకున్నాడని అన్నారు. ఆయన తన నోటితో ముస్లింలను విమర్శించడం ప్రారంభించారని, ఆపై ఫైర్ ఫైటర్లు, దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులనూ వదల్లేదని ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు అక్కర్లేదని, రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్ కు వ్యతిరేకంగా కదలాలని ఒబామా కోరారు.