: ఆ ఊరిలోని ప్రతి ఇంట్లోనూ చోరీ సామాన్లే... చూసి అవాక్కైన నిజామాబాద్ పోలీసులు!


డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి కార్డన్ సెర్చ్ నిమిత్తం నిజామాబాద్ డీఎస్పీ నేతృత్వంలో వెళ్లిన పోలీసులు అవాక్కయ్యారు. అమృతాపూర్ పంచాయతీ పరిధిలోని కాలనీల్లో కార్డెన్ సెర్చ్ జరుగగా, ప్రతి ఇంట్లో సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) నుంచి దొంగతనంగా తెచ్చుకున్న సామాన్లు కనిపించాయి. కాలేజీలో ఉండాల్సిన మంచాలు, టేబుళ్ల నుంచి ఫ్రిజ్, బీరువాలు, సీలింగ్ ఫ్యాన్లు, పేషంట్ల కోసం వాడే బెడ్ లు, దుప్పట్లు... ఇలా ఎన్నో సీఎంసీ ముద్ర వేసివున్న వస్తువులు లభించాయి. కొందరైతే, ఉపయోగపడని సీఎంసీ గదుల తలుపులు కూడా తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నారు. వీటన్నింటినీ తరలించేందుకు ఐదు ట్రాక్టర్లను వాడాల్సి వచ్చింది. వీటిని ఎలా తీసుకు వచ్చారన్న విషయమై విచారణ జరుపుతున్న పోలీసులు, తాము మరోసారి కార్డన్ సెర్చ్ జరుపుతామని, చోరీ చేసిన సామాన్లు కనిపిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News