: యూపీ కంటే గుజరాత్ ఎన్నికలే కీలకం!... బీజేపీకి ఆరెస్సెస్ సూచన!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. గుజరాత్ సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ స్థానంలో కొత్త సీఎంను ఖరారు చేసేందుకే ఈ భేటీ జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ సైద్ధాంతిక కర్త హోదాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆ పార్టీకి కొన్ని సూచనలు చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఆ తర్వాత జరగనున్న గుజరాత్ ఎన్నికలే ముఖ్యమని ఆరెస్సెస్ సూచించింది. ఈ నేపథ్యంలో ఆనందీబెన్ పటేల్ స్థానంలో మరింత బలమైన వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయాలని కోరింది. అంతేకాకుండా గుజరాత్ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపే వ్యక్తికి బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలు ఇవ్వాలని, మొత్తం గుజరాత్ శాఖనే సమూలంగా ప్రక్షాళన చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News