: నేనెప్పుడైనా తృప్తి చెందడం చూశారా?: మీడియాకు చంద్రబాబు ఎదురుప్రశ్న


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీతో మాట్లాడిన తరువాత సంతృప్తి చెందారా? అన్న మీడియా ప్రశ్నకు, తాను ఏ విషయంలోనైనా తృప్తి చెందడాన్ని ఎన్నడైనా చూశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. రాష్ట్రం కేవలం రెండేళ్ల పసిగుడ్డని, ఎవరితో విభేదాలు కొని తెచ్చుకున్నా, నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనన్న ఉద్దేశంతో సామరస్యంగా ముందడుగు వేస్తున్నామని అన్నారు. కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదాపై నిర్దిష్టమైన హామీ లభించే వరకూ తమ పోరు సాగుతుందని అన్నారు. నిన్న పార్లమెంటులో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమైన వేళ, అరుణ్ జైట్లీ ఏపీ గురించి మాట్లాడుతుంటే, అక్కడ మిగతా పార్టీల వారు లేరని, ఇందుకు కారణాలు ఏంటని ప్రశ్నించారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ అర్థంతరంగా ముగియడానికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరేనని చంద్రబాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News