: రూ. 900 కోట్లు నష్టపోనున్న టీఎస్ ఆర్టీసీ!
2016-17 ఆర్థిక సంవత్సరం తెలంగాణ ఆర్టీసీ రూ. 900 కోట్ల మేరకు నష్టాలను భరించాల్సి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేతనాలు పెరగడం, అలవెన్సుల భారానికి తోడు, పాత రుణాలపై కట్టాల్సిన వడ్డీలు పెనుభారం కాగా, మరో 8 నెలలు మిగిలి ఉండగానే నష్ట స్థాయిపై అంచనాలను అధికారులు లెక్క తేల్చారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఇతర అధికారులు సంస్థ పరిస్థితిని సమీక్షించి, ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల కన్నా, విడిపోయిన తరువాత టీఎస్ ఆర్టీసీ నష్టం ఎక్కువగా ఉండనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆర్టీసీ ఉన్న సమయంలో 2013-14లో అత్యధికంగా రూ. 908 కోట్ల మేరకు నష్టాన్ని ఆర్టీసీ భరించిన సంగతి తెలిసిందే.