: ‘ఉగ్ర’ హెచ్చరికలను బేఖాతరు చేసిన రాజ్ నాథ్!... ఇస్లామాబాదులో మూడంచెల భద్రత!


సార్క్ దేశాల హోంశాఖ మంత్రుల సమావేశం కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాద సంస్థల హెచ్చరికలను బేఖాతరు చేశారు. పాక్ పర్యటనకు వస్తున్న రాజ్ నాథ్ ను అడ్డుకుంటామని ఇప్పటికే జమాత్ ఉద్ దవా చీఫ్ హపీజ్ సయీద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్ నాథ్ పర్యటనకు అనుమతి ఇవ్వరాదని కూడా సయీద్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అయితే అతడి డిమాండ్ ను పాక్ ఒప్పుకోలేదు. ఇటు రాజ్ నాథ్ కూడా ఉగ్రవాదుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పాక్ వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. నేడు ఆయన ఢిల్లీలో ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించింది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాజ్ నాథ్ సహా ఇతర దేశాల హోం మంత్రులకు ఎలాంటి అపాయం కలుగకుండా ఉండేందుకు మూడంచెల భద్రతను పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News