: దళితులపై దాడిని సమర్థిస్తూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు... బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు!


బీజేపీ యువనేత, హైదరాబాదులోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదైంది. దళితులపై గోరక్ష దళ సభ్యులు చేసిన దాడిని సమర్థిస్తూ రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారన్న మాల సంక్షేమ సంఘం ఫిర్యాదుతో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఆ కేసు వివరాల్లోకెళితే... ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న తన ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. అందులో గత నెల 22న గుజరాత్ లోని యోనా పట్టణంలో గోరక్ష దళ సభ్యులు దళితులపై దాడి చేసిన దృశ్యాలున్నాయి. దళితులపై గోరక్ష దళ సభ్యుల దాడిని సమర్థిస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దళితులను కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియోను ఆధారంగా చూపుతూ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ మంగళ్ హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్ పై పోలీసులు ఐపీసీ 153ఏ కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News