: వికెట్ పడింది...వర్షం మొదలైంది
వెస్టిండీస్ పాలిట వరుణుడు ఆపద్బాంధవుడయ్యాడు. రెండో టెస్టులో 304 పరుగుల ఆధిక్యంతో టీమిండియా డిక్లేర్ చెయ్యగా మిగిలి ఉన్న రెండు రోజుల ఆటలో విండీస్ ఓటమిని అడ్డుకోవడం అసాధ్యమని అంతా అంచనాలు వేసిన వేళ... అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ వరుణుడు అడ్డం పడ్డాడు. దీంతో నేటి ఉదయం 9 గంటలకు ఆంటిగ్వాలో ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు నాలుగో రోజు మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే కేవలం మూడు ఓవర్ల ఆటను కొనసాగనిచ్చిన వర్షం మళ్లీ జోరందుకోవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి వెస్టిండీస్ 6 పరుగులు చేసింది. బాల అవుట్ సైడ్ వెళ్తుందని చంద్రిక భావించగా, ఇషాంత్ సంధించిన ఆ అద్భుతమైన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది.