: రూ.30 లక్షలు విలువ చేసే ఆకుపచ్చ తాబేళ్లు పట్టివేత
సుమారు రూ.30 లక్షల విలువ చేసే ఆకుపచ్చ తాబేళ్లను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హబీబ్ అనే వ్యక్తి సూట్ కేసులో ఈ తాబేళ్లు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 3 వేల ఆకుపచ్చ తాబేళ్లను మలేషియా నుంచి చెన్నైకి అక్రమ రవాణా చేస్తున్న హబీబ్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం అటవీశాఖాధికారులకు అప్పగించారు.