: చంద్రబాబు ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసం బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని అన్నారు. ప్రత్యేకహోదాను ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యేకహోదా ఉద్యమం నడిపించాలని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లుతెరిచి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.