: వైఎస్సార్సీపీ బంద్ వల్ల ఆర్టీసికి రూ.4 కోట్లు నష్టం: సీఎం చంద్రబాబు
ఏపీలో వైఎస్సార్సీపీ బంద్ వల్ల ఒక్క రోజు ఆర్టీసీకి రూ. 4కోట్లు నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, జగన్ రాష్ట్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇవాల్టి బంద్ వల్ల లాభమేంటో వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎవరితో గొడవపెట్టుకున్నా నష్టపోయేది మనమేనని, కాంగ్రెస్ చేసిన అన్యాయానికి బీజేపీ న్యాయం చేస్తుందనే ఉద్దేశంతోనే వారితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.