: సీఎం కేసీఆర్ రాజీనామాకు డీకే అరుణ డిమాండ్


ఎంసెట్ పేపర్ లీకేజీకి సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంసెట్ లీకేజీ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబంపైనే ఆరోపణలు వస్తున్నా, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సవ్యంగా లేదని, రాష్ట్రంలో పరిపాలనను పోలీసుల చేతుల్లో పెట్టిన కేసీఆర్ తన ఫాంహౌస్ కే పరిమితమయ్యారని డీకే అరుణ విమర్శించారు.

  • Loading...

More Telugu News