: మియాపూర్ లో దారుణం.. భర్తను రోకలి బండతో మోది... భార్య ఆత్మహత్య


హైదరాబాదులోని మియాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వెంకటలక్ష్మి భర్త పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. తాను భార్యకు భారంగా మారానని ఆయన నిత్యం ఆవేదన చెందుతుండేవాడు. దీంతో భర్తకు ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని భావించిన వెంకటలక్ష్మి... భర్తను రోకలి బండతో తలపై మోది... ఆ తర్వాత అపార్ట్ మెంట్ 13వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలపాలైన భర్తను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమారులని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News