: ఎంతో వెరైటీగా దర్శకుడు క్రిష్ పెళ్లి శుభలేఖ


ప్రముఖ దర్శకుడు క్రిష్ వివాహం, డాక్టరు రమ్య సాయితో ఈ నెల 7వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా శుభలేఖను అచ్చువేయించారు. క్రిష్ చిత్రాల్లాగానే ఆయన పెళ్లి శుభలేఖ కూడా ఎంతో వెరైటీగా, ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా బాపూ అక్షరాలతో రూపొందించిన ఈ శుభలేఖ సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఎంతో వెరైటీగా ఉన్న ఈ శుభలేఖ అందరినీ ఆకర్షిస్తోంది. ‘మీ క్రిష్ మనసారా వ్రాయుచున్న శుభలేఖ...’ అనే వాక్యంతో మొదలై,‘నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలయింది.. నిజమైన నా జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతుంది’అనే వాక్యాలతో ముగుస్తుంది.

  • Loading...

More Telugu News