: ‘గో ఇండియా, గో బ్యాక్’ అంటూ హురియత్ నేత రాతలు


భారత్ కు వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా తన మనోభావాలను వ్యక్తం చేసే హురియత్ నేత సయ్యద్ గిలానీ, తాజాగా ఆందోళనకారులను రెచ్చగొట్టే పనులకు పాల్పడ్డారు. కాశ్మీర్ లోని స్థానికుల ఇళ్లు, గోడలపై ‘గో ఇండియా, గో బ్యాక్’ అనే నినాదాలను రాశారు. ఈ విధనగా, ఆందోళనకారులను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కాగా, ఈ రాతలపై కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. వేర్పాటు వాదులను తీవ్రంగా మందలించారు. కాశ్మీర్ ను సిరియాగా మార్చాలనుకుంటున్నారంటూ వేర్పాటువాదులపై ఆమె మండిపడ్డారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హానీ మృతి అనంతరం కాశ్మీర్ కల్లోలంగా మారింది. కాశ్మీర్ లోయలో సుమారు 25 రోజుల పాటు ఇటీవల కర్ఫ్యూ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News