: సెప్టెంబర్ 11న టీఎస్ ఎంసెట్-3 పరీక్ష!
తెలంగాణ ఎంసెట్-3 నిర్వహణపై సందిగ్ధం వీడింది. సెప్టెంబర్ 11న టీఎస్ ఎంసెట్-3 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. టీఎస్ ఎంసెట్-3 కన్వీనర్ గా జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎస్.యాదయ్యను ప్రభుత్వం నియమించింది. పరీక్షకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రొఫెసర్ యాదయ్య ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే టీఎస్ ఎంసెట్-3 కోసం విద్యార్థులు అదనపు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఎంసెట్-2 కు హాజరైన హాల్ టికెట్లతోనే పరీక్షా కేంద్రాలకు హాజరుకావచ్చని తెలుస్తోంది. కేవలం పరీక్షకు విద్యార్థులు సన్నద్ధమైతే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దని పరీక్ష సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.