: బీఎండబ్ల్యూ '520డి ఎం స్పోర్ట్స్' అప్ డేటెడ్ వెర్షన్ విడుదల


బీఎండబ్ల్యూ ప్రీమియం సెడాన్ 520డి ఎం స్పోర్ట్ అప్ డేటెడ్ వెర్షన్ ను విడుదల చేసింది. చెన్నైలోని కంపెనీ ప్లాంట్ లో తయారు చేస్తున్న ఈ మోడల్ కారు ఎక్స్ షోరూం ధర రూ.54 లక్షలని ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది. భారత్ లో బీఎం డబ్ల్యుూ 5 సిరీస్ తర్వాత అధ్యాయం 520 డి ఎం స్పోర్ట్స్ తో మొదలవుతుందని సంస్థ భారతీయ విభాగం అధ్యక్షుడు ఫ్రాంక్ స్కోల్డర్ ఆ ప్రకటనలో తెలిపారు. దీని డీజిల్ వేరియంట్ కార్లు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్ లలో లభిస్తాయని తెలిపింది. బీఎండబ్ల్యూ ప్రీమియం సెడాన్ 520డి ఎం స్పోర్ట్ అప్ డేటెడ్ వెర్షన్ లో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. 0-100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 7.7 సెకండ్లలో అందుకునే ఈ కొత్త కారు అత్యధిక వేగం 233 కిలోమీటర్లు.

  • Loading...

More Telugu News