: అమిత్ షా వల్లే అనందీ బెన్ రాజీనామా?


గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ అనుచరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆగ్రహంగా ఉన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రిగా పని చేసిన అమిత్ షా అక్కడ బ్యాక్ బోన్ గా వ్యవహరించేవారన్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో గుజరాత్ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను గుజరాత్ కు చెందిన ఉన్నతాధికారులు వివిధ విషయాలపై సంప్రదించేవారు. దీంతో పాలనపై ముఖ్యమంత్రి కంటే అమిత్ షాకే పట్టు ఎక్కువని వారు పేర్కొంటున్నారు. అనందీ బెన్ రాజీనామా వెనుక అమిత్ షా ఉన్నారంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు. వయోభారం, పని ఒత్తిడి కారణంగా ఆమె రాజీనామా చేయలేదని, ఆమెకు పరిపాలనలో స్వేచ్ఛ లేకపోవడం, మరోపక్క ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో ఆమె రాజీనామా చేశారని వారు తెలిపారు. ఆమెకు పరిపాలనా స్వేచ్ఛ ఇచ్చి ఉంటే 75 వసంతంలోకి అడుగుపెట్టాక నవంబర్ లో ఆమె స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకునేవారని, కానీ వివాదాలు రేపి ఆమెను అంతకుముందే బాధ్యతల నుంచి నిష్క్రమించేలా చేశారని వారు అమిత్ షాపై ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News