: నేను ఫుల్ టైం బౌలర్ని కాదు... అయినా 5 వికెట్లు తీయడం సంతోషం: విండీస్ బౌలర్


రెండో టెస్టులో అరంగేట్రం చేసిన వెస్టిండీస్ బౌలర్ రోస్టర్ ఛేజ్ టీమిండియాలోని ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. టాప్ బౌలర్లంతా విఫలమైన వేళ ఛేజ్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. దీనిపై ఛేజ్ మాట్లాడుతూ, టీమిండియా లాంటి పటిష్ఠమైన జట్టులో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన కేరీర్ లో మర్చిపోలేని అనుభూతిగా దీనిని అభివర్ణించాడు. జట్టులోకి తాను పార్ట్ టైం బౌలర్ గా వచ్చానని, తాను బ్యాట్స్ మన్ అని స్పష్టం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తనకు బంతి ఇచ్చేవారు కాదని, అందుకే ఆ మ్యాచుల్లో పెద్దగా బౌలింగ్ చేయలేదని చెప్పాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం జట్టు అవసరాల రీత్యా పార్ట్ టైమ్ బౌలర్ అయిన తన చేతికి బంతి అందించారని, పిచ్ ను పరిశీలించి, వేగం తగ్గించి ఫలితం రాబట్టానని ఛేజ్ వెల్లడించాడు. కాగా, విండీస్ తరపున రాణించిన ఏకైక బౌలర్ రోస్టన్ ఛేజ్ కావడం విశేషం. అంతర్జాతీయ టెస్టులో తొలిసారి బౌలింగ్ చేసిన ఛేజ్ 5/121 ఆకట్టుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News