: నిర్మాత అచ్చిబాబుపై దాడిని ఖండించిన మంచు మనోజ్!... సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి వినతి!


విశాఖలో టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై జరిగిన దాడిని యువ హీరో మంచు మనోజ్ తీవ్రంగా ఖండించారు. కొద్దిసేపటి క్రితం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జూనియర్ ఆర్టిస్టుల వైఖరిపై నిప్పులు చెరిగారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు కేంద్రంగానే చిత్ర నిర్మాణం జరుగుతున్నా... విశాఖలో షూటింగ్ అంటే హుషారుగా కదిలివస్తున్న తాము ఈ దాడి నేపథ్యంలో ఇక్కడికి రావాలంటేనే జడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫెడరేషన్ కార్డులు లేని జూనియర్ ఆర్టిస్టులే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలని మంచు మనోజ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే... ఈ దాడిని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది.

  • Loading...

More Telugu News