: ఎంసెట్- 2 లీకు వీరులు 34 మంది!... 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులకూ శిక్ష తప్పదు!: కేసీఆర్ సంచలన ప్రకటన


పేపర్ లీకైందని ఆరోపణలు వెల్లువెత్తిన ఎంసెట్- 2ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రద్దు చేసేసింది. కొద్దిసేపటి క్రితం తన క్యాంపు కార్యాలయంలో లీకేజీ వ్యవహారంపై సమీక్ష చేసిన కేసీఆర్ కు సీఐడీ అధికారులు దర్యాప్తు నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్... లీకేజీ వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఢిల్లీ కేంద్రంగా సాగిన లీకేజీ వ్యవహారంలో మొత్తం 34 మంది బ్రోకర్లున్నారని కేసీఆర్ చెప్పారు. ముకుల్ జై, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్ అనే నలుగురు వ్యక్తులు కీలక సూత్రధారులుగా వ్యవహరించారన్నారు. వీరికి తోడు మరో 30 మంది బ్రోకర్లుగా వ్యవహరించారని ఆయన చెప్పారు. ఈ బ్రోకర్లు పరీక్షలు రాసిన 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. వీరందరిపైనా చర్యలు తప్పవని కేసీఆర్ చెప్పారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిలో ఇప్పటికే ఆరుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా పేపర్ల లీకేజీ నడుస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News