: ముందు ఏపీకి ‘హోదా’పై తేల్చండి!... స్పీకర్ కు మల్లికార్జున ఖర్గే వినతి!
ఏపీకి ప్రత్యేక హోదాకు జాతీయ స్థాయి రాజకీయ నేతల మద్దతు లభించింది. నేటి సమావేశాల్లో భాగంగా ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీల వరుస నిరసనల నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడ్డ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ‘హోదా’కు మద్దతు పలికారు. ముందుగా ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని తేల్చాలని ఆయన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. ఏపీ ఎంపీల వాదన న్యాయమైనదేనని చెప్పిన ఖర్గే... ఆ విషయంపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న రీతిలో సూచనలు చేశారు.