: క్లాస్ రూంలోకి సెల్ ఫోన్ తెచ్చిన స్టూడెంట్!... చితకబాదిన లెక్చరర్!
తరగతి గదిలోకి సెల్ ఫోన్ ను తీసుకురావడమే ఆ విద్యార్థి చేసిన నేరమట. క్లాస్ రూంలో సదరు సెల్ ఫోన్ మోగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ లెక్చరర్ సదరు విద్యార్థినిపై ప్రతాపం చూపారు. వెరసి ఆ విద్యార్ధిని నడవలేని స్థితిలో ఆసుపత్రి పాలు కాగా, లెక్చరర్ పై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని సైదాబాదుకు చెందిన సంగం లక్ష్మీభాయ్ కాలేజీలో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ను క్లాస్ రూంలోకి తీసుకొచ్చిందన్న చిన్న కారణంతో తమ కూతురును చితగ్గొట్టిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు.