: సుశీల్ కుమార్ షిండే మనవడితో పెదవులు కలిపిన శ్రీదేవి కూతురు... ఫోటో వైరల్!


అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, తన బాయ్ ఫ్రెండ్ అయిన శిఖర్ పహారియాతో కలిసున్న వేళ తీయించుకున్న ఓ ప్రైవేట్ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. జాహ్మవి ఈ చిత్రంలో శిఖర్ తో లిప్ లాక్ కిస్ (అధర చుంబనం) లో ఉండటమే ఈ చిత్రాన్ని వైరల్ చేసింది. ప్రస్తుతం న్యూయార్క్ లో నటనలో శిక్షణ పొందుతున్న ఆమె, ఈ ఫోటోలు ఎప్పుడు తీయించుకుందో మాత్రం తెలియరాలేదు. శిఖర్ సోదరుడు వీర్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News