: హ్యాపీగా వెళ్లి విజయంతో వచ్చెయ్: నర్సింగ్ యాదవ్ తో మోదీ
నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడన్న ఆరోపణలు వచ్చి, ఆపై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని రియో ఒలింపిక్స్ కు పయనం కాబోతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్, ఈ ఉదయం ప్రధాని మోదీని కలుసుకున్నాడు. అన్ని రకాల టెన్షన్ లను వదిలివేసి, ఆటపై మనసు నిలిపి, విజయంతో తిరిగిరావాలని మోదీ ఈ సందర్భంగా తనకు సూచించినట్టు నర్సింగ్ వెల్లడించాడు. మోదీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కుస్తీలో ఓ పట్టు పట్టి పతకంతో తిరిగి రావాలని మోదీ అభిలషిస్తూ, తనకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారని వివరించారు. కాగా, డోపింగ్ కేసులో నర్సింగ్ ప్రమేయం లేదని 'నాడా' విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రియోకు వెళ్లేందుకు లైన్ క్లియర్ కాగా, తాను భారత్ కోసం కచ్చితంగా పతకాన్ని సాధిస్తానని చెబుతున్నాడు నర్సింగ్