: నల్ల బ్యాడ్జీలతో కేవీపీ ప్రత్యక్షం!... ఏపీకి ‘హోదా’ కోసం పోరు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఎంపీ!


ప్రత్యేక హోదా విషయంలో ఇటు ఏపీతో పాటు అటు ఢిల్లీలోనూ కాక పుట్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క ఎంపీకి రాని ఆలోచనతో ముందుకు సాగిన కేవీపీ... ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టారు. కేవీపీ ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఏపీలోని అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్షం వైసీపీ కూడా మద్దతు తెలపక తప్పలేదు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా సభలో ఆయన బిల్లును అడ్డుకోవడమే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చిచెప్పింది. ఈ క్రమంలో నేడు సభకు వచ్చిన కేవీపీ నల్లబ్యాడ్జీ పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. సభలోకి వెళ్లే ముందు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News