: ఇండిగో భారీ నష్టాలతో పాతాళానికి ఇంటర్ గ్లోబ్ వాటాలు!


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో నష్టాలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పై పడింది. ఇండిగో బ్రాండ్ పై విమానాలు నడుపుతున్న ఇంటర్ గ్లోబ్, ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో రూ. 529 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ1లో నెట్ ప్రాఫిట్ రూ. 639 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ. 2014-15తో పోలిస్తే సరాసరి విమాన టికెట్ ధరలు 8 శాతం తగ్గాయని, అందువల్లే లాభం కూడా తగ్గిందని ఇంటర్ గ్లోబ్ అధ్యక్షుడు ఆదిత్యా ఘోష్ వెల్లడించారు. ఈ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించగా, సంస్థ ఈక్విటీ పాతాళానికి పడిపోయింది. సెషన్ ప్రారంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 7 శాతానికి పైగా దిగజారిన ఈక్విటీ విలువ, 11:15 గంటల సమయంలో 6.13 శాతం పతనంతో రూ. 914 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 1,314 వద్ద ఉన్న ఈక్విటీ ఆపై ఫిబ్రవరి 11 నాటికి రూ. 722కు దిగజారి, ఆపై స్వల్పంగా తేరుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News