: వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ పట్టు!... ప్రారంభమైన వెంటనే లోక్ సభలో గందరగోళం!
ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎంపీలు లోక్ సభ సమావేశాలను అడ్డుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభలోకి నిన్నటి మాదిరే ప్లకార్డులు చేతబట్టుకుని వచ్చిన టీడీపీ ఎంపీలు ‘హోదా’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రారంభమైన వెంటనే లోక్ సభలో గందరగోళం నెలకొంది. సమావేశాలకు ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. సభలో టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ‘హోదా’ నినాదాలు చేస్తుండటంతో సభా కార్యక్రమాలు స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.