: వివేకానందుడి వేషం వేసిన టీడీపీ ఎంపీ శివప్రసాద్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విచిత్ర వేషధారణతో రంగంలోకి దిగుతున్న టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు లోక్ సభ సభ్యుడు శివప్రసాద్ తాజాగా నేడు స్వామి వివేకానందుడి అవతారం ఎత్తారు. పార్లమెంటు ఆవరణలో తన పార్టీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్న తరుణంలో ఇంటి వద్దే వివేకానందుడి వేషంలోకి మారిపోయిన ఆయన నేరుగా కారులో అక్కడికొచ్చి దిగారు. 'తప్పును సరిదిద్దకుంటే అది మరింత ముప్పును తెచ్చిపెడుతుంది' అని ఆయన వివేకానందుడి సూక్తులను వల్లె వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేంత దాకా తన వినూత్న నిరసనలు కొనసాగుతాయని కూడా ఆయన ప్రకటించారు.