: ఒక్క రోజులో ఆరు అడుగులు పెరిగిన శ్రీశైలం నీటిమట్టం


ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి దిగువకు వస్తున్న నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండటంతో 24 గంటల వ్యవధిలో రిజర్వాయర్ నీటి మట్టం ఆరు అడుగులకు పైగా పెరిగింది. నిన్న 818 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం నేడు 824.6 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ లో 885 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిజర్వాయర్ లోకి 16 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ అధికారుల అంచనాలు నిజమైతే, మరో వారంలోనే శ్రీశైలం నిండు కుండవుతుంది.

  • Loading...

More Telugu News