: మిత్రపక్షమే అయినంత మాత్రాన... నోర్మూసుకుని కూర్చోవాలని ఏమీ లేదు: సుజనా చౌదరి కీలక వ్యాఖ్య


బీజేపీ మాకు మిత్రపక్షమే... అయితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోర్మూసుకుని కూర్చోవాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అన్నీ చేయాల్సి వుంటుందని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు తాము పలు మార్గాల్లో ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగాలో, వాటన్నింటినీ దగ్గర చేస్తామని అన్నారు. హోదాపై ఇప్పటికే పలుమార్లు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో మాట్లాడటం జరిగిందని, ప్రధానిని కూడా రిక్వెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయమై, ప్రధాని నివేదిక అడిగారని సుజనా తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక లోటును భర్తీ చేయాలని, పరిశ్రమలకు మరిన్ని రాయితీలు కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News