: ఒక్క పురాతన భవంతి కూడా ఉండొద్దు: జీహెచ్ఎంసీకి కేటీఆర్ ఆర్డర్


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క పురాతన భవనం కూడా ఉండరాదని, పాతబడి, ఎప్పుడు కూలుతాయా అన్నట్టున్న వాటిని తక్షణమే కూల్చివేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వారిని విదుల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇటీవలి ఇళ్లు కూలిన దుర్ఘటనలపై అధికారులతో సమీక్షించిన ఆయన, గతంలోనే పురాతన భవనాలు తొలగించాలని చేసిన సూచనలను పట్టించుకోలేదని ఆగ్రహించారు. భవనాలపై ఏవైనా కోర్టు కేసులు నడుస్తుంటే, వాటి ముందు బోర్డులు పెట్టాలని, అందులో ఎవరూ నివాసం ఉండకుండా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు పనులను తక్షణం చేపట్టాలని, ఆపై వాటిని ప్రభుత్వ నిధులతోనే కూల్చివేయాలని, అందుకు స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News