: ట్రంప్ ను ఓడించేందుకు రంగంలోకి దిగిన లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్!


అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఓడించేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని, ట్రంప్ ఓటమిని చూడటమే తన లక్ష్యమని లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వ్యాఖ్యానించారు. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో కలసి నెబ్రాస్కాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ఆయన, ట్రంప్ ది దివాలా తీసిన చరిత్రని ఎద్దేవా చేవారు. ట్రంప్ వ్యాపార సంస్థలు పెట్టుబడిదారులకు తీరని నష్టాలను మిగిల్చాయని ఆరోపించారు. పోలింగ్ రోజున వయోవృద్ధులను తాను స్వయంగా దగ్గరుండి తీసుకు వెళ్లి ఓటు వేయిస్తానని, ఇందుకోసం 32 మంది ప్రయాణించగల ట్రాలీని రిజర్వ్ చేశానని అన్నారు. నెబ్రాస్కా రిపబ్లికన్ల అధీనంలో ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో ఒబామాకు ఆధిక్యం లభించిందని గుర్తు చేసిన ఆయన, ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అంచనా వేశారు. కాగా, యూఎస్ లోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు హిల్లరీ క్లింటన్ కే మద్దతు పలుకుతున్నారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News