: కీలక శాఖలో రాణించలేకపోతే ఎలా?... ప్రాధాన్యం లేని శాఖకు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి బదిలీ!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు సమర్థ పాలకుడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పనితీరు సరిగ్గా లేని అధికారులను ఆయన ఎంతమాత్రం ప్రోత్సహించరన్న పేరూ ఉంది. చంద్రబాబు అంచనాల మేరకు పనితీరు కనబరచలేని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కీలక శాఖ నుంచి ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ అయిపోయారు. వివరాల్లోకెళితే... ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం ఇటీవలే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. రాష్ట్రంలోని బీసీల బాగోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ పదవిలో ప్రవీణ్ కుమార్ అంతగా రాణించలేకపోయారు. రోజులు, నెలలు గడుస్తున్నా ఆయన పనితీరులో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు. దీంతో ఆయనను బీసీ సంక్షేమం నుంచి ఏమాత్రం ప్రాధాన్యం లేని వర్షాచ్ఛాయ ప్రాంతాల అభివృద్ధి శాఖకు బదిలీ చేస్తూ నిన్న ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.