: ఆందోళనలతో అస్తవ్యస్తం చేస్తే రాష్ట్రానికే నష్టం: బీజేపీ ఎంపీ హరిబాబు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా పేరుతో అస్తవ్యస్త పరిస్థితులు సృష్టిస్తే రాష్ట్రానికే నష్టమని బీజేపీ ఎంపీ హరిబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఉన్న పలు రాష్ట్రాలకు 2017తో వాటికి ఇచ్చిన గడువు పూర్తవుతుందని అన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, ప్రత్యేకహోదాను మించిన ప్రయోజనాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే పలు అంశాల్లో బాగా సాయం చేసిందన్న సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News