: వరల్డ్ కప్ వరకు లీమనే కోచ్!: క్రికెట్ ఆస్ట్రేలియా
డారెన్ లీమన్ నే కోచ్ గా కొనసాగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయం తీసుకుంది. గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న లీమన్ సారధ్యంలో జట్టు విజయాల బాటపట్టింది. వరుసగా విజయాలు సాధిస్తూ, వన్డేలు, టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో లీమన్ కోచింగ్ సామర్థ్యంపై క్రికెట్ ఆస్ట్రేలియా విశ్వాసం ఉంచింది. దీంతో 2019లో జరగనున్న వరల్డ్ కప్ వరకు లీమన్ నే కోచ్ గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అతనినే కోచ్ గా కొనసాగిస్తున్నట్టు సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోగార్డ్ ప్రకటించారు. ఈ నిర్ణయం జాతీయ సెలెక్షన్ ప్యానెల్ తీసుకుందని హోగార్డ్ తెలిపారు.