: చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయండి: ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన స్మృతి ఇరానీ


ఇటీవ‌లే జౌళిశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్మృతి ఇరానీ చేనేత ప‌రిశ్ర‌మ‌ పుంజుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌జ‌లు చేనేత వ‌స్త్రాల‌నే ధ‌రించాల‌ని ఆమె సోష‌ల్‌మీడియాలో సూచించారు. వాటిని ధ‌రించి త‌మ ఫోటోను సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలని ఆమె సూచించారు. ఆమె కూడా బిహార్‌ నుంచి తెప్పించుకొని మ‌రీ చేనేత సిల్క్‌ చీరను ధరించి ఫోటోదిగి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 'ఐ వేర్‌ హ్యాండ్లూమ్‌' అనే యాష్‌ ట్యాగ్‌తో ఆమె త‌న ఫోటోను సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌జ‌లు కూడా ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్ తో తమ ఫోటోల‌ను పోస్టు చేయాల‌ని, ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్‌ చేయాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News