: రాజీనామాకు సిద్ధపడిన గుజరాత్ ముఖ్యమంత్రి


గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. వయసు మీదపడడంతో ముఖ్యమంత్రి బాధ్యతలు మోయలేకపోతున్నానని, బాధ్యతల నుంచి తప్పించాలని అనందీబెన్ పటేల్ బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా, పటేల్ ఉద్యమం తీవ్రతరం కావడంతో అనందీబెన్ పటేల్ పై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఈ దశలో అనందీ బెన్ పటేల్ పని తీరుపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గుజరాత్ ముఖ్యమంత్రి మారనున్నారని, రేసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఆ సందర్భంలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆమె తాజా వ్యాఖ్యలతో గుజరాత్ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Loading...

More Telugu News