: సాంకేతిక లోపంతో ఇస్తాంబుల్ కు దారి మళ్లిన ఎయిరిండియా విమానం


ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు మళ్లించారు. వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని న్యూజెర్సీలో నెవార్క్ విమానాశ్రయం నుంచి ముంబై రావాల్సిన విమానం మార్గమధ్యంలో ఉండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీనిని గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ కు దారిమళ్లించారు. అక్కడ సాంకేతిక లోపాన్ని సరిదిద్ది తిరిగి ముంబై పంపనున్నట్టు తెలుస్తోంది. కాగా, విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య తదితరాలపై సమాచారం అందాల్సిఉంది.

  • Loading...

More Telugu News