: ఎంసెట్-2 లీకేజీకి నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయాలి: బీజేపీ నేత లక్ష్మణ్
ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్-2 లీకేజీకి సంబంధిత రాష్ట్రమంత్రులు నైతిక బాధ్యత వహించాలని, వారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను తెలంగాణ సర్కార్ అశ్రద్ధ చేస్తోందని ఆయన అన్నారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై పూర్తి విచారణ జరిపి, నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.